వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికపై ప్రత్యేక గ్రామసభ

వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికపై ప్రత్యేక గ్రామసభ

- ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన

షాబాద్, (రంగారెడ్డి): సర్దార్ నగర్ గ్రామంలో వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలో భాగంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ మామిడి కీర్తి హరీష్, ఏపీఓ వీరా సింగ్సమక్షంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక ఉద్దేశం, విధానం, ప్రాధాన్యతలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీ పరిధిలో ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి అవసరమైన అంశాలను గుర్తించి, సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యతా క్రమంలో పనులను ప్రణాళికలో చేర్చనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News