ఆదిలాబాద్ రిమ్స్ ని సందర్శించిన దళిత జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు.: కాంబ్లీ ప్రజ్ఞాశిల్
- ఘటనకు పూర్తి బాధ్యత అధికారులదే,
- బాధితులకు పరిహారం పెంచాలి
- దళిత జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంబ్లె ప్రజ్ఞశీల్
ఆదిలాబాద్ బ్యూరో )రాష్ట్రంలో సంచలనం రేపిన, ఆదిలాబాద్ ప్రభుత్వం ఆసుపత్రి రిమ్స్ ఎస్.ఎన్.సి.యూ పిల్లల వార్డ్ లో ఏసీ లో షార్ట్ సర్క్యూట్ తో కారణంగా అలుముకున్న పొగతో ఐదుగురు పసి పిల్లల మృతి ఘటన పై క్షేత్ర స్థాయిలో లోపాలపై, ఘటన వాస్తవ పరిస్థితులపై దళిత జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కాంబ్లె ప్రజ్ఞశీల్ రిమ్స్ ని సందర్శించడం జరిగింది, ఈ నెల 21 న అర్ధరాత్రి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో నీఎస్ ఎన్ సి యు పిల్లల వార్డ్ లో జరిగిన ఘటనను సందర్శించి న బృందం భావోద్వేగానికి గురయ్యారు,ప్రస్తుతం పిల్లల వార్డ్ లో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు,బాధిత మరియు ట్రీట్మెంట్ తీసుకుంటున్న పిల్లల తల్లులను ట్రీట్మెంట్ అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు,ఘటన పై ఆసుపత్రి సిబ్బంది అభిప్రాయం తీసుకున్నారు, నూతనంగా ఏర్పాటు చేసిన పిల్లల వార్డ్ ను సందర్శించారు, జిల్లా ప్రజలకి ప్రధాన ఆసుపత్రి రిమ్స్ లో (రిమోట్ )మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డిమాండ్ చేసారు, రిమ్స్ సందర్శన లో అధికారుల నిర్లక్ష్యం, ఆసుపత్రి నిర్వహణ లోపం ఘటనకు ముఖ్య కారణం గా భావిస్తున్నామని కాంబ్లె ప్రజ్ఞశీల్ అన్నారు, అనంతరం ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ తో సమావేశమైన బృందం తగు సూచనలు చేసారు,దళిత జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కాంబ్లె ప్రజ్ఞశీల్ మీడియా తో మాట్లాడుతూ ఘటనపై మా బృందం నివేదికను జిల్లా కలెక్టర్ కు మరియు ప్రభుత్వ విచారణ కమిటీకి అందిస్తామని బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేసారు,ఉట్నూర్ లోని జిల్లా ఆసుపత్రి పరిస్థితి దారుణం గా ఉందని ఏజెన్సీ ప్రాంతంలోని నిరుపేదలకు సేవలు అందించడం లేదని కనీస సాకర్యాలు లేవని, మందుల కొరత, ఆసుపత్రి నిర్వహణ దారుణంగా ఉందని వాపోయారు, పేరుకే ఉట్నూర్ లో జిల్లా ఆసుపత్రి అని కనీస సేవలు లోపించాయని ఏజెన్సీ ప్రాంతాల ప్రజల కోసం, ఆసుపత్రి నిర్వహణ, మరమ్మత్తులకు ఉట్నూర్ లోని జిల్లా ఆసుపత్రి కి 100కోట్లు, ఆదిలాబాద్ రిమ్స్ కి 250 కోట్ల రూపాయల నిధులు వెంటనే ప్రభుత్వం కేటాయించాలని, మౌలిక సదుపాయాలు, సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో దళిత జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కాంబ్లె ప్రజ్ఞశీల్ దళిత జేఏసీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జాడి వెంకటేష్ నేత , దళిత జేఏసీ జిల్లా కార్యదర్శి కళ్యాణ్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ వావల్కర్ ధనరాన్, వికాస్ తదితరులు పాల్గొన్నారు..
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


