కామారెడ్డి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన పాలకమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల -ఎన్.వై. గిరి
కామారెడ్డి;కామారెడ్డి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన పాలకమండలి ఏర్పాటుకై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను అడిషనల్ కలెక్టర్ మరియు ఎన్నికల పరిశీలకులు ఎన్.వై. గిరి విడుదల చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 8న జిల్లా ఎన్నికల అధికారి నియామకం జరిగిందని, సెప్టెంబర్ 9 నుండి 14 వరకు ఓటర్ల ప్రాథమిక జాబితా ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 15న ఓటర్ల సవరణల దరఖాస్తుల స్వీకరణ, సెప్టెంబర్ 16న రాష్ట్ర శాఖ ఆమోదానికి అప్పీళ్ల పంపకం పూర్తి చేసి, సెప్టెంబర్ 19న తుది ఓటర్ల జాబితాతో పాటు అధికారిక ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రచురిస్తారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 24న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు జరుగుతుంది. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి రూ. 10,000/- నాన్-రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాలని, ప్రతీ నామినేషన్‌ను ఇద్దరు అర్హులైన సభ్యులు ప్రతిపాదించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం సెప్టెంబర్ 25న నామినేషన్ల పరిశీలన, సెప్టెంబర్ 26న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు నామినేషన్ల ఉపసంహరణ సమయం ఉంటుంది. అదే రోజు (సెప్టెంబర్ 26) మధ్యాహ్నం 3:00 గంటలకు పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా వెల్లడిస్తారు. అవసరమైతే అక్టోబర్ 4న ఉదయం 08:00 నుండి మధ్యాహ్నం 03:00 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 04:00 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. లెక్కింపు పూర్తయిన వెంటనే నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం, ఛైర్మన్, వైస్ ఛైర్మన్, ట్రెజరర్, మరియు స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడి ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, అక్టోబర్ 5న సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర శాఖకు సమర్పిస్తారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమాచారం, సందేహాలు లేదా పూర్తి వివరాల కొరకు కామారెడ్డి కలెక్టరేట్‌లోని రూమ్ నంబర్ 2 నందు నేరుగా సంప్రదించవచ్చని లేదా 9492555350 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


