ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం
దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

హైదరాబాద్ : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం” కు దరఖాస్తుల స్వీకరణ గడువును 2026 సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1.19 లక్షల మంది అర్హులైన బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100 శాతం సబ్సిడీపై అందించనున్నట్లు మంత్రి తెలిపారు.ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 2026 సెప్టెంబర్ 30వ తేదీలోగా TGOBMMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు విజ్ఞప్తి చేశారు. బీసీ మహిళలకు ఇంటి నుంచే స్వయం ఉపాధి పొందే అవకాశాలను కల్పించడం, తద్వారా వారి కుటుంబాల ఆదాయాన్ని పెంపొందించి ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని మంత్రి తెలిపారు. పథకానికి సంబంధించిన సమాచారం అర్హులైన ప్రతి మహిళకు చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించి, అర్హులైన వారందరూ గడువులోగా దరఖాస్తు చేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


