​గిరిప్రదక్షిణలు కాదు...

కొండగట్టు సమస్యలు తీర్చండి: డా. బండారి రాజ్‌కుమార్

​గిరిప్రదక్షిణలు కాదు...

​మల్యాల,: జగిత్యాల జిల్లా కొండగట్టులో జనసేన కరీంనగర్ నాయకులు డా. బండారి రాజ్‌కుమార్ గురువారం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సును, పవన్ కళ్యాణ్  ప్రజాసేవ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
​అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటనపై స్పందించారు. భక్తులు ఆశించింది గిరిప్రదక్షిణ వార్తలు కాదని, కొండగట్టు అభివృద్ధికి స్పష్టమైన దిశానిర్దేశమని పేర్కొన్నారు. తాగునీరు, పార్కింగ్, కాటేజీలు, రహదారులు వంటి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రకటించకపోవడం నిరాశపరిచిందన్నారు. ​పవన్ కళ్యాణ్ పై చేసిన 'పెయిడ్ ఆర్టిస్ట్' వ్యాఖ్యలను తప్పుబడుతూ... వ్యక్తిగత విమర్శలు పక్కనపెట్టి 'డెవలప్‌డ్ కొండగట్టు' విజన్ చూపించండి. ప్రజలు రాజకీయ వ్యాఖ్యలను కాదు, అభివృద్ధిని మాత్రమే గుర్తుంచుకుంటారు అని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డా. సాయి కృష్ణ ప్రియ, రాజిత, మొగిలిపాక రమేష్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలి
ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి..
భారీ వర్షాలతో ఉట్నూర్–మత్తడిగూడ వాగుపై రాకపోకలు నిలిచివేత
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోలి సంతోష్
చక్రియాల గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవాలు