మిడ్జిల్లో ఘనంగా పండుగ సాయన్న జయంతి
ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలి
మిడ్జిల్ మండల కేంద్రంలో బహుజన నాయకుడు పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల హక్కుల కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పండుగ సాయన్న చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు.
అనంతరం ముదిరాజ్ సంఘ నాయకులు మాట్లాడుతూ, ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుని, తక్షణమే అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎడ్ల శంకర్, గోపాల్, మల్లేష్తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ముదిరాజ్ సంఘం బాధ్యులు, బహుజన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


