బాలాపూర్ లో స్పీకర్ గడ్డ ప్రసాద్ కు ఘన స్వాగతం
- మహా గణనాధుడి సేవలో కాంగ్రెస్ నేతలు
- సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా పూజాక్రతువు : కిచ్చెన్న
హైదరాబాద్ : బాలాపూర్ మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీఐపీల దర్శనం జరగాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం రాత్రి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, KLR, మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి సహా పలువురు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీ సభ్యులు బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వినాయక మండప కమిటీ ఛైర్మన్ నిరంజన్ రెడ్డి సహా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ నేతలు భారీగా తరలి వచ్చి స్పీకర్ గడ్డం ప్రసాద్, కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డి కిచ్చెన్నగారిని ఆత్మీయంగా శాలువాలతో ఘనంగా సన్మానించారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


