గాంధారి మండల వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్.కు ఫిర్యాదు.
- రైతు అంటే అధికారులకు అంత చులకన నా?
- రైతులను అవమానపరిస్తే ఉపేక్షించేది లేదు -పైడి విటల్ రెడ్డి
- రాష్ట్రస్థాయిలో ఫిర్యాదు చేస్తాం - రైతునాయకులు
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా గాంధారి మండల వ్యవసాయ అధికారి రాజలింగం రైతును ఫోన్లో అసభ్య పదజాలంతో దూషిం చినందుకు రైతులు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈనెల 13 తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ విషయమై గాంధారి మండల వ్యవసాయ అధికారి రాజలింగంకు ఫోన్ చేయడం తో రైతును దుర్బుషలాడారని ఆయనను వెంటనే విధుల నుండి తొలగించాలని చేయాలని కోరుతూ రైతులు కలెక్టర్ కార్యాలయం చేరుకొని జెసి విక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం తెలంగాణ తల్లి విగ్రహం ముందు రైతులు నిరసన తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం ఆవరణలో ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ. రైతులకు సలహాలు సూచనలు అందించే వ్యవసాయ శాఖ అధికారులు దుర్బుషలాడడం సిగ్గుచేటని అన్నారు. రైతు యూరియా యాప్ కోసం వ్యవసాయ అధికారిని సంప్రదించగా ఆదివారం ఎందుకు ఫోన్ చేశావు అని కట్ చేశారు. అనంతరం ఐదు నిమిషాల తర్వాత సదరు వ్యవసాయ అధికారి రైతుకు ఫోన్ చేసి గాంధారి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన రైతు రవిని తీవ్ర పరుష పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. అవమాన కరమైన పదజాలంతో దూషిస్తూ ని సంగతి చూస్తా రేపు కార్యాలయానికి రా నీ అంత చూస్తా అని బెదిరించారని అన్నారు. ఫోన్ రికార్డింగ్ తో పూర్తి స్థాయిలో జెసికి అందజేశారు. గత మూడు రోజులుగా రైతుని పదజాలంతో దూషించిన వ్యవ సాయ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు కలెక్టరేట్ కు తరలివచ్చారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి మండల వ్యవసాయ అధికారి రాజలింగం విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లా యంత్రాంగం స్పందించకపోతే రాష్ట్రస్థాయిలో ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పైడి విటల్ రెడ్డీ , కార్యదర్శిశంకర్, భైరవరెడ్డి, చిన్న అంజన్న,, మాధవ రావు, రవి, నాగయ్య వసంతరావు సాయిలు,, లక్ష్మణ్, మైసయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


