వయోజన విద్య స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో అక్షర వికాసం శిక్షణ కార్యక్రమం 

వయోజన విద్య స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో అక్షర వికాసం శిక్షణ కార్యక్రమం 

నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్  మోస్రా మండలంలోని గోవూర్ గ్రామంలో వయోజన విద్యాశాఖ మరియు స్నేహ సొసైటీ సౌజన్యంతో ULLAS – నవభారత్ సాక్షరత కార్యక్రమంలో భాగంగా కుట్టు శిక్షణ పొందుతున్న అక్షర వాలంటీర్లకు అక్షర వికాసం వాచకంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వయోజన విద్య ఉప సంచాలకులు  ఏ. పురుషోత్తం, గోవూర్ సర్పంచ్ రవి, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్  రాజు, MEO నాగనాథ్, MPO, APM, పంచాయతీ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ULLAS రిసోర్స్ పర్సన్ శ్రీ రాములు  అక్షర వాలంటీర్లకు అక్షర వికాసం వాచకంలోని పాఠ్యాంశాలు, బోధనా పద్ధతులు, అభ్యాస కార్యక్రమాలు మరియు నూతన అక్షరాస్యులకు చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు నేర్పించే విధానాలపై ఆచరణాత్మక శిక్షణ అందించారు.
అలాగే ఆర్థిక అక్షరాస్యత (Financial Literacy), పొదుపు, బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక లావాదేవీలపై అవగాహన కల్పించారు. ఎల్ నినో (El Niño) ప్రభావం, వాతావరణ పరిస్థితులపై కూడా చర్చించారు.
కుట్టు శిక్షణతో పాటు అక్షరాస్యతను పెంపొందించుకోవడం ద్వారా మహిళలు విద్యాపరంగా, ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News