జోర్ధార్ గ కొనసాగిన పూజలు అన్నదానం 

జోర్ధార్ గ కొనసాగిన పూజలు అన్నదానం 

బాల్కొండ  :- నిజామాబాదు జిల్లా బాల్కొండ లో ఉన్న శ్రీ నిమిషంభ దేవి అమ్మవారి ఆలయంలో ప్రతి నెల మొదటి శుక్రవారం అన్నదానంలో బాగంగా నవంబర్ మొదటి శుక్రవారం రోజున పూజాల అనంతరం వివిధ జిల్లాల నుండి హాజరైన భక్తులు అమ్మవారికి ఓడిబియ్యాలు మొక్కులు సమర్పించు కున్నారు.అనంతరం టోకెన్ నేం (83) నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన గౌతమ మహాముని గోత్రం పోలకొండ విష్ణు శ్రీలత, అన్షిత్, కృష్ణ, గంగారాణి, అలాగే బాల్కొండ లోని బ్రాహ్మ్మ రౌతు రాహుల్ సంయుక్తoగా అన్నదానం చేసారు.ఈ కార్యక్రమంలో ఆలయానికి చెందిన అమ్మవారి సేవకులు బి గంగాధర్ బి. జగన్,బి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ సేవకులు బ్రహ్మరౌతు నర్సింగ్ రావు మాట్లాడుతూ
బాల్కొండ లో కొలువై ఉన్న 
శ్రీ నిమిషంబ దేవి పంచంలోహ విగ్రహానికి (1059) నుండి (2026) నవoబర్ నాటికి (967) సంవత్సరాలుగా నేటికీ నిత్య నైవేద్య పూజలు కొనసాగడం విశేషంగా ఉందని పైగా భారత దేశంలోనే 4 వ ఆలయంగా ప్రసిద్ధి చెందినదని నర్సింగ్ రావు వివరించారు. ఇది ఇలా ఉండగా కలి కాల ప్రభావంతో ఊర్లో ప్రాముఖ్యత పురాతన ఆలయాన్మి కాదని 
వేరే ఊర్లో ఉన్న అలయాలకు వెళ్ళాడలో అర్థం లేదని "పుట్టిన చంటి పిల్లని సంకలో పెట్టుకొని ఊరంతా తిరిగిందట. " పైగా గొర్రె మందలో ఒక గొర్రె పరు గెత్తుకుంటూ వెళ్లి గోతిలో పడగానే గోర్లు ఏది ఆలోచన చేయకుండా గోతిలో ఏముందో అని మిగతా గోర్లు కూడా గోతిలో పడి పోతున్నాయని నర్సింగ్ రావు ఆవేదన వ్యక్తం చేసారు.

ఆలయంలో అభివృద్ధి పనులకు చేయూత ఇవ్వండి 

బాల్కొండ(అల్లకొండ)ఆలయంలో (01).శ్రీ నిమిషంబ దేవి కల్యాణ మండపం నిర్మాణా నికి మరియి(02).ఉత్తర దక్షిణ సింహ ద్వారం పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నా యని అమ్మ వారి భక్తులు పంపే కానుకలు " శ్రీ నిమిషంబ దేవి టెంపుల్ డెవలప్మెంట్ సొసైటీ " అకౌంట్ నుంబర్ 073710011109628 యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా "బాల్కొండ " నిజామాబాదు బ్రాంచి ఐ. ఆఫ్. ఎస్.సి. నేం.యి.బీ.ఐ.యన్. 0807371.లేదా క్యూ.. ఆర్. కోడ్ ద్వారా పంపి "స్క్రీన్ షాట్" ను తీసి సెల్ నేం.9666759297 కు పంపాలని ఆలయ సేవకులు బ్రహ్మ రౌతు నర్సింగ్ రావు కోరారు. 

అన్న దానానికి ఖాళీలు

డిసెంబర్ 2026 నుండి డిసెంబర్ 2027 వరకు ప్రతి నెల మొదటి శుక్రవారాల్లో అన్నదానం చేయాలనుకునే కుటుంబాలు తమ కుటుంబ పేర్లు, గోత్రాలు మరియు కుటుంబ సమూహ ఫోటోలతో 9666759297 నంబ ర్‌కు ఫోన్ చేసి టోకెన్ నంబర్    పొందాలని ఆలయ సేవకులు బ్రహ్మ రౌతు నర్సింగ్ రావు కోరారు."అన్నదానం చేస్తే పుణ్యఫలం, ఆకలితో ఉన్న వారికి అన్నం దానం చేయడం వల్ల "నిత్యం అన్నపూర్ణ " కొలిచినట్లే కాకుండా ఆ ఇంట్లో సిరి సంపాదలకు నిలయంగా మారు తుందని అయన వివరించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News