రేపటి నుంచి పాలెం వెంకన్న ఆలయం చుట్టూ గిరిప్రదక్షిణ
ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రదక్షిణ.. 7 గంటలకు పల్లకి సేవ
బిజినపల్లి (నాగర్ కర్నూల్) : పాలెం గ్రామంలోని శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం చుట్టూ రేపటి నుంచి ప్రతి శనివారం గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది. భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి భక్తిశ్రద్ధలతో పాల్గొనాలని కోరారు. ఏడు శనివారాల పాటు ఏడు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.గిరిప్రదక్షిణ అనంతరం సాయంత్రం 7 గంటలకు స్వామివారి పల్లకి సేవ నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


