విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లపై కారుతో దాడి

నాగర్ కర్నూల్ లో పోలీస్ వాహనం ధ్వంసం.. నిందితుడు రిమాండ్

విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లపై కారుతో దాడి

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్లను కారుతో ఢీకొట్టి గాయపరిచిన వ్యక్తిని నాగర్ కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.పోలీసుల కథనం ప్రకారం... నిందితుడిని నీరటి శరత్ గా గుర్తించారు. నిన్న ఉదయం విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్లపై కారుతో దూసుకెళ్లి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. అంతటితో ఆగకుండా పోలీస్ వాహనాన్ని కూడా ధ్వంసం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం, హత్యాయత్నం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నాగర్ కర్నూల్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. వెంకట్ రెడ్డి వెల్లడించారు. నిందితుడు మద్యం మత్తులో ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలిందని, పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని ఆయన తెలిపారు. గాయపడిన కానిస్టేబుళ్లను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసులపై దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవని, చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని పోలీసులు హెచ్చరించారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!