కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం

ఫలించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషి , అంజన్న భక్తులకు శాశ్వతంగా తీరనున్న తాగునీటి కష్టాలు   ​

కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న భక్తుల చిరకాల కోరిక నెరవేరింది. క్షేత్రానికి వచ్చే వేలాది మంది భక్తుల తాగునీటి అవసరాల నిమిత్తం కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పరిపాలనాపరమైన ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను నీటిపారుదల శాఖ విడుదల చేసింది.  
​కొండగట్టుకు నిరంతరం తరలివచ్చే భక్తులకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రత్యేక కృషి ఫలించి, ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భక్తులతో పాటు పరిసర ప్రాంతాల వారికి కూడా నీటి ఇబ్బందులు తొలగిపోనున్నాయి.  ​ప్రాజెక్టు ఆమోదంపై స్థానిక ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలియజేశారు.  
​

Views: 28

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం
కొత్తగూడెం బ్యూరో : డిజిటల్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని కొత్తగూడెం సబ్ ఇన్‌స్పెక్టర్ జుబేదా...
దీపావళి వేడుకల్లో తగు జాగ్రత్తలు పాటించాలి: యువత, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలి – పుల్కల్ ఎస్ఐ విశ్వజన్
డీఈవో చేతుల మీదుగా బహుమతులు అందుకున్న సిద్ధార్థ విద్యార్థులు
మోడల్ స్కూల్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం
మునుగోడులో ఘనంగా సుంకరి బిక్షం గౌడ్ విరమణ వేడుక.
చేగుంట బస్టాండ్ దుస్థితి మార్చే వారే లేరా
ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వెలుగులు నింపాలి