ఎస్సీల వర్గీకరణ విజయం మాదిగ అమరవీరులకు అంకితం ...

"ఎస్సీల వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘన నివాళులు . - మంద కుమార్ మాదిగ

WhatsApp Image 2026-03-01 at 3.29.00 PM

 

హన్మకొండ : పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ  నాయకత్వంలో రాజ్యాంగబద్ధంగా అమలు అవుతున్న ఎస్సీ రిజర్వేషన్లు మాదిగలకు జనాభా దామాషా ప్రకారం వాటా రావడంలేదని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న 30 ఏళ్ల వర్గీకరణ పోరాటంలో ఎందరో మాదిగ బిడ్డలు తమ అమూల్యమైన ప్రాణాలను జాతి కొరకు జాతి భవిష్యత్తు కోసం అర్పించారని ఎమ్మెస్పీ జాతీయ నేత మంద కుమార్ మాదిగ , ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బోర్ర బిక్షపతి మాదిగలు అన్నారు. మార్చ్ ఒకటి మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్ మాదిగ అధ్యక్షతన జరిగిన మాదిగ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నా ఎమ్మెస్ పి జాతీయ నేత మంద కుమార్ మాదిగ  , ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బోర్ర బిక్షపతి మాదిగలు మరియు ఎంఎస్పి జాతి నాయకులు వేల్పుల సూరన్న కాపు , ఎమ్మార్పీఎస్ మాజీ జాతీయ పోలీట్ బ్యూరో సభ్యులు బొడ్డు దయాకర్ మాదిగ ,ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు పుట్ట రవి మాదిగ ,మంద రాజు మాదిగ , ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్ను దినేష్ మాదిగ ,ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు. బండారి సురేందర్ మాదిగ మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరు అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో  మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ నాయకులు కుమ్మరి రాజయ్య మాదిగ , ఎం ఈ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద చిన్నరాజు మాదిగ ,మాదిగ యువసేన జాతీయ నాయకులు  చాతల్ల శివ మాదిగ , పుట్ట బిక్షపతి మాదిగ , ఎం ఎస్ పి జిల్లా సీనియర్ నాయకులు అక్కెనకుంట వెంకటస్వామి మాదిగ , ఉపాధ్యక్షులు రాజారపు బిక్షపతి మాదిగ , జేరిపోతుల సారంగపాణి మాదిగ , ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శులు సుంచు రజిని కుమార్ మాదిగ , మంద స్వరాజ్ మాదిగ , మాదిగ యువసేన మాజీ జిల్లా అధ్యక్షులు జేరిపోతుల సతీష్ మాదిగ , ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మంద వర్ధన్ మాదిగ , ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు రేణుకుంట్ల దుర్గాప్రసాద్ మాదిగ , రేణుకుంట్ల రాజేందర్ మాదిగ , ఎర్ర రాము మాదిగ , సదానందం మాదిగ మరియు తదితరులు పాల్గొన్నారు ...

Views: 36

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News