మంచినీటి శుద్ధి కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని

WhatsApp Image 2026-03-01 at 3.21.42 PM

 

హన్మకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి కేంద్రాలను శాసన సభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నాయిని విశాల్ ట్రస్ట్,తవంతి  టెక్నాలజీస్  మరియు బాల వికాస్ సంయుక్త ఆధ్వర్యంలో 54వ డివిజన్ పోచమ్మకుంట, 4వ డివిజన్ జ్యోతిబసు నగర్ ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్లాంట్ లను ఎమ్మెల్యే  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల మౌలిక అవసరాల్లో తాగునీరు అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటి కొరత ఉన్నదని గుర్తించి, ప్రైవేట్ సంస్థల సహకారంతో ఈ శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజారోగ్యం పరిరక్షణలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని స్పష్టం చేశారు.నియోజకవర్గంలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు తక్కువ ఖర్చుతో నాణ్యమైన తాగునీరు పొందేలా ఈ ప్లాంట్లు ఉపయోగపడతాయని చెప్పారు. ప్రజలు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, పరిశుభ్రతను పాటించాలని పిలుపునిచ్చారు.అడిగిన వెంటనే స్పందించి సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చిన టవంతి  టెక్నాలజీస్  మరియు బాల వికాస్ సభ్యులకు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ప్రజల అవసరాలను గుర్తించి, ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని మరిన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి మంచినీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టవంతి  సంస్థ చైర్మన్ దేవన శేషా రెడ్డి,బాల వికాస్ సంస్థ డైరెక్టర్ షౌరెడ్డి,యువ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి మరియు ఆయా డివిజన్ ల ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News