ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం.

గ్రేటర్ వరంగల్ ను ఆరోగ్య నగరంగా మార్చాలి.

WhatsApp Image 2026-03-01 at 3.23.22 PM

 

హన్మకొండ : ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రణతి పాలిక్లినిక్ వారి సహకారంలో హన్మకొండలోని రెడ్డి కాలనీ, గ్రేటర్ వరంగల్ 4 వ డివిజన్ లో మెగా వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది. ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్, డెంటల్, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.ఇండస్ ఫౌండేషన్ సభ్యులు, మెడికల్ క్యాంప్ నిర్వాహకులు క్యాతం సందీప్ కుమార్, కంజుల నితిన్ అధ్యర్యంలో నిర్వహించిన ఈ క్యాంప్ లో 450 మందికి బీపీ, షుగర్ టెస్ట్ లు చేసి ఉచిత మందులు అందజేశారు. 150 మంది డెంటల్, సాధారణ వైద్య పరీక్షలు చేసుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు, ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి హాజరవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీగా పేరుగాంచినప్పటికీ, ఇందులో 70% నిరుపేద ప్రజలు మురికి వాడల్లో నివాసం ఉంటారు. ఎక్కువ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలే నివాసం ఉంటారు. పెరుగుతున్న నగర జనాభాకు  అనుగుణంగా ప్రభుత్వ హాస్పిటల్ సౌకర్యాలు లేకపోవడం, ప్రయివేటు వైద్యం చేసుకునే స్థోమత లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను దూరం చేయడానికి, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రణతి పాలిక్లినిక్, డాకర్ అలియాస్ డెంటల్ క్లినిక్ వారి సహకారంలో హన్మకొండలోని రెడ్డి కాలనీలో  మెగా వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది. ఇదే స్పూర్తితో నగరంలోని అన్ని ప్రాంతాల్లో వీలైనంతగా మెగా వైద్య శిబిరాలు పెట్టీ ప్రజలకు సేవ చేయాలని ఇండస్ ఫౌండేషన్ ప్రణాళిక చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండస్ ఫౌండేషన్ కార్యదర్శి పురుషోత్తం యాదవ్, ఇండస్ ఫౌండేషన్ సభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, నారాయణగిరి రాజు, పేశెట్టి యాదగిరి, చింతం శ్రీను, లక్ష్మణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Views: 52

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News