ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా అమరుల స్థూపాన్ని కప్పిన ఫ్లెక్సీలు బాధాకరం: ఎండీ లాల్ మహమ్మద్
ధర్మసాగర్, జూలై 16
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల తెలంగాణ అమరుల స్థూపం పూర్తిగా కనిపించకుండా పోవడం బాధాకరమని బీఆర్ఎస్ మైనార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎండీ లాల్ మహమ్మద్ అన్నారు.తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిందని, వారి త్యాగాలను ఎల్లప్పుడూ గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులు అందరిపైనా ఉందన్నారు. అయితే ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అమరుల స్థూపాన్ని కప్పివేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.అమరుల స్మారక చిహ్నాల గౌరవాన్ని కాపాడేలా అధికారులు, నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎండీ లాల్ మహమ్మద్ డిమాండ్ చేశారు.
About The Author
విజయ్ శ్రీరాముల. ప్రొఫెషనల్ వెబ్ న్యూస్ కంటెంట్ రైటర్. డిజిటల్ మీడియా ద్వారా సమాచారాన్ని సమర్థవంతంగా చేరవేయడంలో . కరెంట్ అఫైర్స్, స్థానిక మరియు అంతర్జాతీయ వార్తలు, సాంకేతికత, మరియు వ్యాపార రంగాలకు సంబంధించిన తాజా విషయాలను లోతుగా పరిశోధించి, పాఠకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో డిజిటల్ కంటెంట్‌ను రూపొందిస్తాను


