విద్యార్థుల భవిష్యత్తుకు మత్తు పదార్థాలు గొడ్డలిపెట్టు
.jpg)
చెడు అలవాట్లకి దూరంగా ఉండడం ద్వారా మాత్రమే ఉజ్వల భవిష్యత్తు : మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పూజ
చర్ల, (భద్రాద్రి కొత్తగూడెం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఉంజుపల్లి ఎస్టీ బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థులకు బుధవారం మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హోమియో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పూజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యసనాల పట్ల తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పూజ మాట్లాడుతూ విద్యార్థులు సరదా కోసం లేదా స్నేహితుల ఒత్తిడి వల్ల గుట్కా తంబాకు సారా బీడీ సిగరెట్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి అలవాట్లు ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా చదువులో వెనుకబడేలా చేసి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తాయని వివరించారు, శారీరక మానసిక మరియు ఆర్థిక నష్టాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు
మంచి స్నేహితులను ఎంచుకోవడం మరియు చెడు అలవాట్లు ఉన్న వారికి దూరంగా ఉండడం ద్వారా మాత్రమే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ఆమె పేర్కొన్నారు వ్యసనాలకు బానిసలైన వారు నిరుత్సాహపడకుండా దృఢ సంకల్పంతో వాటి నుంచి బయటపడాలని పిలుపునిచ్చారు, మత్తు పదార్థాలను ప్రేరేపించే వ్యక్తులు మరియు ప్రదేశాలకు దూరంగా ఉండడమే వ్యసన విముక్తికి ఏకైక మార్గమని ఆమె హితవు పలికారు , మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని విద్యార్థులకు ఆమె దిశానిర్దేశం చేశారు. అనంతరం వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు హోమియో మందులు అందజేసి చికిత్స అందించారు,హోమియో వైద్యం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు, ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ గోపి ఆరోగ్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 33
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
