సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం.

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం.

  • తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి.
  • ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం.

తాండూరు (వికారాబాద్ జిల్లా) సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి అన్నారు.శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే బీఎంఆర్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్స్ లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా తాండూరు నియోజకవర్గంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరైయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న ఉపాధ్యాయుల సేవలు ఎంతో గొప్పవని ఎమ్మెల్యే కొనియాడారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల అభ్యున్నతికి మరింత అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.నూతనంగా ఏర్పడిన ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులకు ఎమ్మెల్యే బీఎంఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యారంగ  అభివృద్ధికి అందరం సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమానికి సహకరించి, విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు  ఎమ్మెల్యే తెలిపారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా
సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
డీజేలకు అనుమతి లేదు
ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం 
ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
టిబి పోషణ కిట్ల పంపిణీ
తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ