డిండి ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలి
- ఎర్రవెల్లి, గోకారం, ఉల్పర, అజిలాపూర్ గ్రామాలను ముంపు నుంచి కాపాడాలి.
- ఉమ్మడి పాలమూరు జిల్లా జలసాధన జేఏసీ డిమాండ్
నాగర్ కర్నూల్ జిల్లా : పాలమూరు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు జేఏసీ పోరాటంనాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని స్థానిక గాంధీ పార్కులో ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జల సాధన సత్యాగ్రహ దీక్ష రైతులు,ప్రజాస్వామికవాదులసహకారంతోవిజయవంతమైంది.జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా చైర్మన్ మొసలి శ్యాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజేందర్ రెడ్డి, రాఘవాచారి, నాగం శశిధర్ రెడ్డిహాజరయ్యారు.ఈసందర్భంగా వక్తలుమాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా అధికార,ప్రతిపక్షప్రజాప్రతినిధులకు పాలమూరు ప్రాజెక్టులు, రైతుల సమస్యలపై సోయి లేదా అని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాకు నీటి తరలింపు పేరుతో పాలమూరు రైతులకు అన్యాయం జరుగుతున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. డిండి ప్రాజెక్టు పేరుతో పాలమూరు ప్రాంతంలోని రైతులు, గ్రామాలు నష్టపోయే పరిస్థితిని తీవ్రంగావ్యతిరేకిస్తున్నామని, డిండి ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.అలాగే ఎర్రవెల్లి, గోకారం, ఉల్పర, అజిలాపూర్ గ్రామాలను ముంపునకు గురిచేసే చర్యలను వెంటనే నిలిపివేసి, ఆయా గ్రామాలను ముంపు నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రొఫెసర్ కోదండరాంసంఘీభావంజల సాధన సత్యాగ్రహ దీక్షకు తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం ఫోన్ ద్వారా సంఘీభావం తెలిపారు. పాలమూరు జిల్లా రైతాంగం నీటి హక్కుల కోసం పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటం న్యాయమైనదని ఆయన పేర్కొన్నారు.రైతుల హక్కులు, పాలమూరు ప్రాంతానికి న్యాయం జరిగేలా విధాన మండలిలో ఈ అంశంపై ఖచ్చితంగా మాట్లాడి న్యాయం కోసం కృషి చేస్తానని ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు. అజిలాపూర్‌కు పాదయాత్ర డిండి ప్రాజెక్టు పనుల వల్ల ముంపు ముప్పును ఎదుర్కొంటున్న గ్రామాల సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ఉల్పర నుంచి అజిలాపూర్ వరకు పాదయాత్రనిర్వహించేందుకుజేఏసీసిద్ధమవుతోంది.పాలమూరు రైతాంగం హక్కుల కోసం, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. జల సాధన సత్యాగ్రహ దీక్షకు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేసిన వేలాది మంది రైతులకు, ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మొసలి శ్యాంప్రసాద్ రెడ్డి, వంగ లక్ష్మణ్ గౌడ్, సదానందం గౌడ్, కానుగు జంగయ్య, చెన్నకిష్టయ్య, బెక్కెం జనార్ధన్, తిమ్మప్ప, శ్రీనివాస్ నాయక్, టిజి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


