అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
యలమల గోపీచంద్, ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్
దేవరకొండ: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 12-09-2026న విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ కార్యకర్తలు, నాయకులపై ముందస్తు అరెస్టులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సింది పోయి, వాటి గురించి ప్రశ్నిస్తున్న విద్యార్థి నాయకులను అర్థరాత్రి వేళల్లో ఇళ్లకు వెళ్లి భయాందోళనలకు గురిచేస్తూ అరెస్టు చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయం ఏబీవీపీ ఎప్పటినుంచో విద్యార్థుల హక్కులు, పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా రంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యమాలు నిర్వహిస్తోంది. ఇటువంటి అక్రమ అరెస్టులతో ఉద్యమ స్ఫూర్తిని అణచివేయలేరు ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలపై స్పందించి, పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని, విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. విద్యార్థుల హక్కుల సాధన కోసం ఏబీవీపీ ప్రజాస్వామ్యబద్ధంగా తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాము *అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు – యలమల గోపీచంద్, ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


