రౌడీ షీటర్లకు ముందస్తు కౌన్సిలింగ్..

రౌడీ షీటర్లకు ముందస్తు కౌన్సిలింగ్..

  • వినాయక చవితి సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల చర్యలు..
  • 30 మందికి పైగా బైండోవర్.. 
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు..
  • పట్టణ సీఐ వెంకటయ్య..

సూర్యాపేట : వినాయక చవితి పండుగ సందర్భంగా సూర్యాపేట పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు, సమస్యాత్మక వ్యక్తులకు ముందస్తు కౌన్సిలింగ్ నిర్వహించారు.పండుగ వేడుకల సందర్భంగా ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పట్టణ సీఐ వెంకటయ్య హెచ్చరించారు. వినాయక మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాల సమయంలో ఎలాంటి గొడవలు, వివాదాలకు పాల్పడకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.పట్టణంలో పాత నేర చరిత్ర కలిగిన, రౌడీ షీటర్లుగా నమోదైన వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న సుమారు 30 మందికి పైగా వ్యక్తులపై బైండోవర్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, ఎలాంటి అనుమానాస్పద ఘటనలు లేదా గొడవలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీఐ వెంకటయ్య కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు అజయ్, సందీప్ రెడ్డి, కనకరత్నం, పోలీసు సిబ్బంది శ్రీరాములు, రామ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా
సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
డీజేలకు అనుమతి లేదు
ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం 
ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
టిబి పోషణ కిట్ల పంపిణీ
తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ