ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయం – ఇద్దరు అరెస్ట్

ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయం – ఇద్దరు అరెస్ట్

  • 15 బియ్యం బ్యాగులు.. 450 కిలోల పిడిఎస్ బియ్యం స్వాధీనం.
  • వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ముగ్గురిపై కేసు నమోదు
  • వన్ టౌన్ సిఐ బి సునీల్ కుమార్

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అయిన నిందితులు: 

1. షైక్ అమన్ (23) తండ్రి .అఫ్సర్, శాంతినగర్, ఆదిలాబాద్.
2. షైక్ జమీర్ (24) తండ్రి .షైక్ సలీం, శాంతినగర్, ఆదిలాబాద్.

పరారీలో ఉన్న నిందితుడు:*తుఫెల్ జమీల్ షైక్ @ షైక్ సాహిల్, వాడికి గ్రామం, మహారాష్ట్ర.వన్ టౌన్ సీఐ బి సునీల్ కుమార్ తెలియజేసిన వివరాల ప్రకారం అరెస్ట్ అయిన నిందితులు రేషన్ డీలర్ల నుంచి తక్కువ ధరకు పిడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ ఉంచి, బ్యాగుల్లో నింపి అమాయక ప్రజలకు స్వచ్ఛమైన బియ్యమని నమ్మించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అదేవిధంగా పరారీలో ఉన్న తుఫెల్ జమీల్ షైక్ @ షైక్ సాహిల్‌కు పిడిఎస్ బియ్యాన్ని విక్రయించి మహారాష్ట్రలో అధిక ధరకు అమ్మేందుకు సిద్ధంగా ఉంచినట్లు నిందితులు తెలిపారు.నిందితుల వద్ద నుంచి 15 బియ్యం బ్యాగులు, సుమారు 450 కిలోల పిడిఎస్ బియ్యం, విలువ సుమారు రూ.9,000/- స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, అధిక ధరలకు విక్రయించడం చట్టవిరుద్ధమని 1 టౌన్ సీఐ బి. సునీల్ కుమార్ తెలిపారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగనాథ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా
సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
డీజేలకు అనుమతి లేదు
ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం 
ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
టిబి పోషణ కిట్ల పంపిణీ
తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ