కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ నేతలు!
మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బైరంపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారు పెద్ద ఎల్లయ్య, లకుమల నరేష్, కొర్నె శ్రీశైలం, గొడుగు వెంకటేష్, పోలె శివలను మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నూతనంగా చేరిన నాయకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్ ముదిరాజ్, మాజీ మార్కెట్ డైరెక్టర్ కాడయ్య, బీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య ముదిరాజ్, వెంకటయ్య గౌడ్, యాదయ్య గౌడ్, మల్లేష్, కృష్ణ ప్రసాద్, నారాయణ, భాగం రాములు, పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


