పెన్‌పహాడ్ మండల ఎస్‌జీఎఫ్ క్రీడల విజేతలు వీరే
పెన్‌పహాడ్,(సూర్యాపేట ): మండల పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ అనంతారం పాఠశాల వేదికగా రెండు రోజుల పాటు సాగిన పెన్‌పహాడ్ మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల అభివృద్ధి అధికారి ఏ. జానయ్య గెలుపొందిన క్రీడాకారులకు బహుమ తులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో రాణించి డివిజన్, జిల్లా స్థాయిలో మండలానికి మంచి పేరు తేవాలన్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన ఎంఈఓ ఎన్. రవి, ఆతిథ్యమిచ్చిన హెచ్‌ఎం ఎర్రంశెట్టి రవీంద్రబాబు, వ్యాయామ ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. అనంతరం ప్రతిభావంతులైన క్రీడాకారుల ను ఉన్నత స్థాయి జట్లకు ఎంపిక చేశారు.రెండు రోజుల పాటు హోరాహోరీగా సాగిన పోటీల ఫలితాలు ఇలా ఉన్నాయి. అండర్-14 బాలికల కబడ్డీలో అనాజిపురం జెడ్పీహెచ్ఎస్ మొదటి బహుమతి సాధించగా, దోసపహాడ్ గురుకులం రెండవ బహుమతి గెలుచుకుంది. ఖో-ఖోలో అనాజిపురం జెడ్పీహెచ్ఎస్ మొదటి బహుమతి, దోసపహాడ్ గురుకులం రెండవ బహుమతి సాధించాయి. వాలీబాల్‌లో జీ.మల్కాపురం జెడ్పీహెచ్ఎస్ మొదటి బహుమతి, పెన్‌పహాడ్ కేజీబీవీ రెండవ బహుమతి కైవసం చేసుకున్నాయి. అండర్-17 బాలికల కబడ్డీలో దోసపహాడ్ గురుకులం మొదటి బహుమతి, పెన్‌పహాడ్ కేజీబీవీ రెండవ బహుమతి సాధించాయి. ఖో-ఖోలో దోసపహాడ్ గురుకులం మొదటి బహుమతి, అనాజిపురం జెడ్పీహెచ్ఎస్ రెండవ బహుమతి పొందాయి. వాలీబాల్‌లో జీ.మల్కాపురం జెడ్పీహెచ్ఎస్ మొదటి బహుమతి, పెన్‌పహాడ్ జెడ్పీహెచ్ఎస్ రెండవ బహుమతి సాధించాయి.అండర్-14 బాలుర కబడ్డీలో అనాజిపురం జెడ్పీహెచ్ఎస్ మొదటి బహుమతి, పెన్‌పహాడ్ జెడ్పీహెచ్ఎస్ రెండవ బహుమతి గెలిచాయి. ఖో-ఖోలో అనంతారం జెడ్పీహెచ్ఎస్ మొదటి బహుమతి, అనాజిపురం జెడ్పీహెచ్ఎస్ రెండవ బహుమతి సాధించాయి. వాలీబాల్‌లో పెన్‌పహాడ్ జెడ్పీహెచ్ఎస్ మొదటి బహుమతి, జీ.మల్కాపురం జెడ్పీహెచ్ఎస్ రెండవ బహుమతి పొందాయి. అండర్-17 బాలుర కబడ్డీలో అనాజిపురం టీజీఎమ్ఎస్ మొదటి బహుమతి, అనంతారం జెడ్పీహెచ్ఎస్ రెండవ బహుమతి సాధించాయి. ఖో-ఖోలో అనాజిపురం టీజీఎమ్ఎస్ మొదటి బహుమతి, అనంతారం జెడ్పీహెచ్ఎస్ రెండవ బహుమతి కైవసం చేసుకున్నాయి. వాలీబాల్‌లో జీ.మల్కాపురం జెడ్పీహెచ్ఎస్ మొదటి బహుమతి సాధించగా, అనాజిపురం టీజీఎమ్ఎస్ రెండవ బహుమతితో సరిపెట్టుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడి శోభ, జిహెచ్ఎం అంజయ్య, పల్స వెంకన్న, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


