రహదారిపై బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ట్రాన్స్‌జెండర్ అరెస్ట్

రహదారిపై బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ట్రాన్స్‌జెండర్ అరెస్ట్

  • జామ్దాపూర్ ‘X’ రోడ్డు వద్ద వాహనాలను అడ్డగించి డబ్బులు డిమాండ్
  • కేసు నమోదు చేసిన ఆదిలాబాద్ రూరల్ ఎస్సై వి విష్ణువర్ధన్

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జామ్దాపూర్ ‘X’ రోడ్డు వద్ద వాహనాలను అడ్డగిస్తూ ప్రయాణికుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐ V. విష్ణువర్ధన్ మరియు సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న మెహెక్ ఖాన్ @ సోను (26) s/o ఆరిఫ్ ఖాన్, భుక్తాపూర్, ఆదిలాబాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజా రహదారులపై వాహనాలను అడ్డగించి బలవంతంగా డబ్బులు డిమాండ్ చేసే వారిపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. బలవంతంగా డబ్బులు వసూలు చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా
సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
డీజేలకు అనుమతి లేదు
ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం 
ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
టిబి పోషణ కిట్ల పంపిణీ
తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ