సీఎస్ఎఫ్‌ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పోలబోయిన నరేష్

  • విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం*
  • ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, హాస్టల్ సమస్యలపై ఉద్యమాలు

అక్కన్నపేట : భారత కేంద్ర విద్యార్థి సమాఖ్య (సీఎస్ఎఫ్‌ఐ) కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా కా. పోలబోయిన నరేష్‌ను నియమించినట్లు భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (క్లాస్ స్ట్రగుల్) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కా. లింగంపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు.కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సీఎస్ఎఫ్‌ఐ నిరంతరం పనిచేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా కళాశాలల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల సాధనతో పాటు విద్యార్థుల హాస్టల్ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందాల్సిన దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాల్లో నెలకొన్న సమస్యలపై కూడా సీఎస్ఎఫ్‌ఐ నిరంతరం ఉద్యమాలు చేపడుతోందన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం వారిని సంఘటితం చేసి పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఎన్‌ఈపీ–2020 రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం–2020 (ఎన్‌ఈపీ–2020)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని లింగంపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్య అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, పేద విద్యార్థుల విద్యకు ఆటంకం కలిగించే విధానాలను వ్యతిరేకిస్తూ విద్యార్థులను ఐక్యం చేసి ఉద్యమాలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా
సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
డీజేలకు అనుమతి లేదు
ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం 
ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
టిబి పోషణ కిట్ల పంపిణీ
తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ