బంగారు, వెండి ఆభరణాల చోరీ – నిందితుడి అరెస్ట్

బంగారు, వెండి ఆభరణాల చోరీ – నిందితుడి అరెస్ట్

  • రూ.85,600 విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం :100% రికవరీ
  • క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ ఆధారాలతో కేసు చేదన
  • దొంగ వస్తువులు కొనుగోలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు. ఎస్సై ఎల్. శ్రీకాంత్

ఆదిలాబాద్  : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని మహంకాళి గల్లీలో ఓ ఇంట్లో తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన కేసులో ప్రధాన నిందితుడిని గుడిహత్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ ఎల్ శ్రీకాంత్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 9న బాధితురాలు దుర్వ రాధ తన భర్తతో కలిసి కూలి పనికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన సమయం లో ఇంటి తాళం, లోపల ఉన్న స్టీల్ బాక్స్ తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. బాక్స్‌లో ఉన్న సుమారు రూ.85,600 విలువైన బంగారు, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించి రెండు పగిలిన తాళాలను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ బ్యూరో సహకారంతో స్టీల్ బాక్స్ తదితర వస్తువులపై ఉన్న వేలిముద్రలను సేకరించారు. సంఘటనా స్థలానికి సంబంధించిన  దర్యాప్తు కొనసాగించారు. నిందితున్ని శుక్రవారం అరెస్ట్ చేయడం జరిగింది అని తెలిపారు. దొంగతనం చేసిన వస్తువులను కొనుగోలు చేసిన వ్యక్తిపై  సైతం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అరెస్ట్ చేసిన నిందితుడు:
A1) పెండూర్ మధుకర్ (21) s/o కిషన్, డ్రైవర్, గిర్జై గ్రామం, బజార్‌హత్నూర్ మండలం, ప్రస్తుతం గుడిహత్నూర్.( దొంగ) A2) దహలే సంతోష్ (46) s/o నారాయణ, గోల్డ్‌స్మిత్, లింగాపూర్ రోడ్, గుడిహత్నూర్, (దొంగ వస్తువులను కొనుగోలు చేసిన వ్యక్తి) దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతిక ఆధారాలతో పాటు క్షేత్రస్థాయిలో పలు కోణాల్లో విచారణ చేపట్టారు. నిందితుడి కదలికలను గుర్తించి, చోరీ చేసిన ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కేసులో చోరీకి గురైన మొత్తం ఆభరణాలను 100 శాతం రికవరీ చేసి బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టారు. దొంగతనం చేసిన వస్తువులు అని తెలిసి కూడా వాటిని కొనుగోలు చేయడం లేదా విక్రయించేందుకు సహకరించడం చట్టపరంగా నేరమని, ఇలాంటి వ్యవహారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎల్. శ్రీకాంత్ హెచ్చరించారు. ప్రజలు తమ ఇళ్లకు నాణ్యమైన తాళాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు, ఎక్కువ సమయం ఇంటికి తాళం వేసి వెళ్లాల్సి వస్తే సమీప  పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా
సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
డీజేలకు అనుమతి లేదు
ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం 
ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
టిబి పోషణ కిట్ల పంపిణీ
తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ