విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం
లోవోల్టేజీ సమస్యకు పరిష్కారం
ఎల్లారెడ్డిపేట,: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీరామకృష్ణ సినిమా టాకీస్ సమీపంలో ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను శనివారం సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, ఏఎంసీ చైర్మన్ షేక్ సబేరా బేగం గౌస్‌లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై విద్యుత్ భారం తగ్గడంతోపాటు, శ్రీరామకృష్ణ సినిమా టాకీస్ వద్ద ఏర్పాటు చేసిన నూతన ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా పరిసర ప్రాంతంలోని గృహ వినియోగదారులకు లోవోల్టేజీ సమస్య పరిష్కారం కానుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎలగందుల నరసింహులు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, ఉపసర్పంచ్ బందారపు బాల్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కృష్ణయాదవ్, వార్డు సభ్యులు అంతేర్పుల గోపాల్, అంగూరి ప్రవీణ్, మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి, నాయకులు నేవూరి సర్వయ్య, గారి పద్మారెడ్డి, జగన్‌రెడ్డి, గుండాడి వెంకట్‌రెడ్డి, గంట బుచ్చాగౌడ్, రాపెల్లి అంబదాస్, రఫీక్, దొనుకుల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


