బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్
నాంపల్లి మండలంలోని సుంకిశాల గ్రామపంచాయతీ పాత ఊరు ఇండ్ల స్థలాలను దౌర్జన్యంగా యజమానులకు తెలియకుండా కబ్జా చేయాలని చూస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని, అలాగే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానిక గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇదే గ్రామానికి చెందిన తుమ్మలపల్లి సుజాత దేవి, భర్త లోహిత్ రెడ్డి వద్ద ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకొని 30 సంవత్సరాలు ఇక్కడే నివసించామని. అసౌకర్యాల కారణంగా మెయిన్ రోడ్డు స్టేజి వద్దకుకు వెళ్లడం జరిగింది.అయితే ఖాళీగా ఉన్న పాత ఊరు ఇండ్లను యజమానులకు తెలియకుండా దౌర్జన్యంగా జెసిబి తో గోడలను కూలగొట్టి కబ్జా చేయాలని చూస్తున్నాడు.అట్టి వారిపై తగు చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. లేనిపక్షంలో కలెక్టర్ గారి ఆఫీసు ముందు న్యాయపోరాటం చేస్తామని గ్రామస్తులు అన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


