అర్ధరాత్రి ఎలాంటి సమాచారం లేకుండా బీజేవైఎం నాయకులను అరెస్టు చేయడం సరికాదు

అర్ధరాత్రి ఎలాంటి సమాచారం లేకుండా బీజేవైఎం నాయకులను అరెస్టు చేయడం సరికాదు

  • అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
  • బీజేవైఎం నాయకులు హనుమగళ్ల బాలరాజ్ 

రాజాపూర్ : రాజాపూర్ మండల కేంద్రంలోని బీజేవైఎం నాయకులను గురువారం అర్ధరాత్రి 12పోలీసులు  అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బిజెపి పార్టీ నుండి ఎలాంటి నిరసనలకు, ఎలాంటి కార్యక్రమాలకు పిలుపు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అన్యాయంగా అర్ధరాత్రి సమయంలో బీజేవైఎం నాయకులను తమ ఇళ్లలోకి వచ్చి ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తు అరెస్టులు చేయించడం సరికాదని బీజేవైఎం నాయకులు హనుమగళ్ల బాల్ రాజ్ అన్నారు.  ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం లేకపోయినా ముందస్తుగా ఎందుకు అరెస్టు చేశారని, ఇలాంటి అక్రమ అరెస్టులు ఎన్ని చేసినా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పోరాటంలో ముందుంటామని  అన్నారు. ముందస్తు సమాచారం లేకుండా మమ్మల్ని అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని, మేమేమైనా దేశద్రోహులమా అని ఇలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడటం సరికాదని ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాలు చేయడంలో ఎప్పుడైనా ముందుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముందస్తు అక్రమ అరెస్టు అయినవారిలో బీజేవైఎం జనరల్ సెక్రెటరీ  లక్ష్మీనారాయణ, హన్మగాళ్ల బాల్ రాజ్, ప్రశాంత్, పవన్ ప్రభ తదితరులు ఉన్నారు. 

Views: 68

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా
సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
డీజేలకు అనుమతి లేదు
ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం 
ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
టిబి పోషణ కిట్ల పంపిణీ
తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ