ఖాళీ స్థలానికి ఇంటి నంబరా?

అధికారుల తీరుపై కార్పొరేటర్‌ విజయ మల్లేష్‌ ఆగ్రహం

ఖాళీ స్థలానికి ఇంటి నంబరా?

గోదావరిఖని: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 1వ డివిజన్‌ ఇందిరమ్మ కాలనీలో ఖాళీ స్థలానికి తనకు సమాచారం లేకుండా ఇంటి నంబరు కేటాయించడంపై సమగ్ర విచారణ జరిపించాలని కార్పొరేటర్‌ మడిపెల్లి విజయ మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఇన్‌చార్జి కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.గతంలో ఇంటి నంబరు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇల్లు పూర్తయి ఉండాలని, రంగులు వేయడంతో పాటు బాత్‌రూమ్‌ నిర్మాణం తప్పనిసరిగా ఉండాలని అధికారులు అనేక నిబంధనలు విధించారని తెలిపారు. అలాంటిది ప్రస్తుతం ఖాళీ స్థలానికే ఏ ప్రాతిపదికన ఇంటి నంబరు కేటాయించారో అధికారులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.ప్రజా సంక్షేమం కోసం ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌, అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి కమిషనర్‌ కృషి చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు చెడ్డపేరు తెచ్చేలా ఉందని ఆరోపించారు. ఖాళీ స్థలానికి కేటాయించిన ఇంటి నంబరును వెంటనే రద్దు చేసి, వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజయ మల్లేష్‌ డిమాండ్‌ చేశారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా
సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
డీజేలకు అనుమతి లేదు
ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం 
ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
టిబి పోషణ కిట్ల పంపిణీ
తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ