డిజిటల్ క్రాప్ సర్వే (పంట నమోదు)ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : ఏవో పాండురంగాచారి
అడ్డగూడూరు, : రైతులు సాగు చేసిన పంట వివరాలను డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా (పంట నమోదు) చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి పాండురంగాచారి కోరారు. మండల కేంద్రంలో జరుగుతున్న పంట నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన డీసీఎస్ యాప్ ద్వారా ప్రతి రెవిన్యూ గ్రామానికి ఒక ప్రైవేట్ సర్వేయర్ ను నియమించి పంట వివరాలు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. సర్వేయర్లు క్షేత్ర స్థాయిలో రైతుల పొలాల వద్దకు వచ్చి పంట వివరాలు సేకరించి ఆన్లైన్లో పంట ఫోటో తీసి నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. రైతులందరూ ప్రైవేట్ సర్వేయర్స్ ను వినియోగించుకొని పంట వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. పంట వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకుంటేనే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తుందని పంటల నమోదుకు ఈ నెల 30 వరకు చివరి తేదీ అని తెలిపారు. గ్రామాల వారీగా సర్వేయర్లు ఇలా అడ్డగూడూరుకు మేకల పవన్ (1 నుండి 600 సర్వే నెంబర్ వరకు), కురిమిల్ల కరుణాకర్ (601 నుండి 980 సర్వే నెంబర్ వరకు), కంచనపల్లి-సుంకరబోయిన విజయ్ కుమార్, రేపాక- మార్లేని నరేష్, జానకిపురం- దేవనబోయిన వెంకన్న, చిన్నపడిశాల-చుక్కా శ్రీకాంత్, చౌల్లరామారం- చిలుక ప్రభాకర్, చిర్రగూడూరు-బండి నరేష్, కోటమర్తి-గూడ లింగస్వామి, ధర్మారం- కత్తుల అమూల్యకుమార్, వెల్దేవి-నిమ్మల పవన్ చంద్ర, గట్టుసింగారం-జంపాల మణికుమార్ (1 నుండి 600 సర్వేనెంబర్), మారోజు నందకిషోర్ (601 నుండి 800 సర్వే నెంబర్)ల వరకు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఏవైనా సందేహాలు ఉంటే గ్రామాల్లోని ఏఈఓలను సంప్రదించాలని అన్నారు. అడ్డగూడూరు, రేపాక, కంచనపల్లి, ధర్మారం, గట్టుసింగారం, వెల్దేవి గ్రామాలకు ఏఈవో ఎ. అనూష, జానకీపురం చిన్నపడిశాల, చౌల్లరామారం, చిర్రగూడూరు, కోటమర్తి గ్రామాలకు ఏఈవో ఎస్.అక్షర అందుబాటులో ఉంటారని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


