నిర్మల్ కొయ్యబొమ్మలు, పోచంపాడు ప్రాజెక్టు, అంకాపూర్ సందర్శించిన

 నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు

నిర్మల్ కొయ్యబొమ్మలు, పోచంపాడు ప్రాజెక్టు, అంకాపూర్ సందర్శించిన

 

 

నిజామాబాద్ : విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి అవగాహన, ప్రత్యక్ష అనుభవం కల్పించేందుకు నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం ఆధ్వర్యంలో విద్యా పర్యటన నిర్వహించారు. ఈ పర్యటనలో సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ విద్యా పర్యటనలో భాగంగా విద్యార్థులు నిర్మల్ కొయ్యబొమ్మలు, పోచంపాడు ప్రాజెక్టు, అంకాపూర్ ప్రాంతాలను సందర్శించారు. నిర్మల్ కొయ్యబొమ్మల తయారీ విధానం, వాటి ప్రత్యేకత, కళాకారుల నైపుణ్యం గురించి విద్యార్థులు తెలుసుకున్నారు. అనంతరం పోచంపాడు ప్రాజెక్టు (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) ను సందర్శించి, ప్రాజెక్టు నిర్మాణం, సాగునీటి ప్రాధాన్యత, నీటి వనరుల వినియోగం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే అంకాపూర్ గ్రామాన్ని సందర్శించిన విద్యార్థులు అక్కడి వ్యవసాయ విధానాలు, గ్రామీణ జీవన విధానం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠ్యాంశాలను ప్రత్యక్ష అనుభవంతో అనుసంధానం చేసుకునే అవకాశం ఈ పర్యటన ద్వారా విద్యార్థులకు లభించిందని, ఇటువంటి విద్యా పర్యటనలు విద్యార్థుల్లో పరిశీలనా శక్తి, ప్రశ్నించే తత్వం, సామాజిక అవగాహనతో పాటు ప్రకృతి, వ్యవసాయం, కళలు, నీటి వనరులపై ఆసక్తిని పెంపొందిస్తాయని ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. విద్యార్థుల సమగ్ర వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ రమేష్ గారికి, ఉపాధ్యాయ బృందానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల వెంట ఉపాధ్యాయులు అభిలాష్, రవిచంద్ర, మమతా గుప్తా, జ్యోతి రాణి, కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా
సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
డీజేలకు అనుమతి లేదు
ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం 
ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
టిబి పోషణ కిట్ల పంపిణీ
తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ