ధన్వాడ, గంగారం సబ్‌స్టేషన్లను తనిఖీ చేసిన డీఈ నాగరాజు
కాటారం (భూపాలపల్లి): కాటారం మండలంలోని ధన్వాడ, గంగారం 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లను కాటారం డీఈ,(ఆపరేషన్) డి. నాగరాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్లలో విద్యుత్ లోడ్ పరిస్థితి, వోల్టేజ్ ప్రొఫైల్‌ను పరిశీలించారు. అలాగే వల్లంకుంట మరియు తాడిచర్ల 33 కేవీ ఫీడర్లకు సంబంధించిన 33 కేవీ, 11 కేవీ ఫీడర్లపై లోడ్ పరిస్థితి మరియు వోల్టేజ్ ప్రొఫైల్‌ను సమీక్షించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా విద్యుత్ స్తంభాలపై విధులు నిర్వహించే సమయంలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, తగిన భద్రతా పరికరాలను ఉపయోగిస్తూ జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీలో కాటారం సెక్షన్ లైన్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, లైన్‌మ్యాన్ ప్రవీణ్ మరియు కాటారం సెక్షన్‌కు చెందిన అన్‌మ్యాన్డ్ సిబ్బంది పాల్గొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఈ నాగరాజు సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


