లయన్స్ ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం.

లయన్స్ ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం.

బోధన్, (నిజామాబాద్) : లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్ పల్లి ఆధ్వర్యంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ పట్టణంలోని విజేత జూనియర్ కళాశాల లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లయన్స్ ఇంటర్నేషనల్ ఎండి 320 జిఎంటి లయన్ పి.బసవేశ్వర రావు హాజరై మాట్లాడుతూ ఎక్కడైతే ప్రకృతి విపత్తులు సంభవిస్తాయో వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సంస్థ నిధులను సమకూర్చి వారికి సహాయ పడుతుందన్నారు. సమాజానికి విశిష్ట కృషి చేస్తున్న వారిని సన్మానించడం ద్వారా సమాజానికి తోడ్పాటును అందించినట్లు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లయన్స్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమాలు దేశం మొత్తంలో సెలబ్రేట్ చేస్తున్నామన్నారు. విశిష్ట అతిధిగా విచ్చేసిన ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ లయన్ వి.లక్ష్మి మాట్లాడుతూ గురువులకు సమాజంలో అత్యున్నత స్థానం ఉందని, వారిని గౌరవించిన వారికే సమాజంలో ఒక స్థాయి ఉంటుందని గురువుని ఎప్పటికీ మరిచిపోరాదన్నారు. ఎంఈఓ పి.నాగయ్య మాట్లాడుతూ సమాజంలో లయన్స్ సేవలను కొనియా డుతూ గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల అభినందించారు. తల్లిదండ్రులను, విద్యార్థులను, గురువులను కలిపి ఆలోచనలు పంచుకుంటేనే విద్యార్థి భవిష్యత్తు మారుతుందని అది ఉజ్వల భవిష్యత్తుకు నాంది అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ జెరూష, రీజన్ చైర్మన్ రంగారావు, క్లబ్ అధ్యక్షుడు దుర్గారావు, సెక్రటరీ రమణారెడ్డి, ట్రెజరర్ భగవాన్ కైలాసప్ప, ప్రోగ్రాం చైర్మన్ విజేత కళాశాల డైరెక్టర్ రమణారెడ్డి, కో చైర్మన్ వెంకటేశ్వరరావు,ఎస్ కృష్ణమోహన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు గాంధీ,హరిబాబు, సత్యనారాయణ, చార్టర్ ప్రెసిడెంట్ శంకర్, జిఈటి పళ్లెంపాటి శ్రీధర్, జిఎస్టీ శ్యామ్ సుందర్ పహాడే తదితరులు పాల్గొన్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా
సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
డీజేలకు అనుమతి లేదు
ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం 
ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
టిబి పోషణ కిట్ల పంపిణీ
తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ