తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తాం... కామ్రేడ్  విలాస్

తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తాం... కామ్రేడ్  విలాస్

ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ రూరల్ మండలంభీంసారి గ్రామంలో ఘనంగా 78వ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసారి గ్రామంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చిల్కా దేవిదాస్ ఆధ్వర్యంలో 78వ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ ఎస్. విలాస్, సీపీఐ ఆదిలాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ సిర్ర దేవేందర్, సీపీఐ ఆదిలాబాద్ పట్టణ కార్యదర్శి కామ్రేడ్ కట్ట చంద్రమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా భీంసారి గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు, కామ్రేడ్స్ పండరినాథ్, రామయ్య, పార్ల విట్టల్, పూర్ణచందర్ స్మారక స్థూపాల వద్ద నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కామ్రేడ్ ఎస్. విలాస్, కామ్రేడ్ చిల్కా దేవిదాస్, కామ్రేడ్ కట్ట చంద్రమౌళి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం, పేద ప్రజల హక్కుల కోసం జరిగిన మహత్తర పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం అని అన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన వీరోచిత పోరాటంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. 1946లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటం వేలాది మంది రైతులు, కూలీలు, పేద ప్రజలను ఏకం చేసి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గొప్ప ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుందని అన్నారు. ఈ పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టులు, రైతులు, కూలీలు, మహిళలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని గుర్తుచేశారు. “దున్నేవాడికే భూమి” అనే నినాదంతో సాగిన పోరాటం ఫలితంగా లక్షలాది ఎకరాల భూమి పేద ప్రజల చేతుల్లోకి వచ్చిందని పేర్కొన్నారు.తెలంగాణ సాయుధ పోరాటం దేశ చరిత్రలోనే ఒక గొప్ప రైతాంగ పోరాటంగా నిలిచిందని అన్నారు. ఆ పోరాట స్ఫూర్తితోనే నేటికీ సీపీఐ పేదలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, యువత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు.ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలను అమలు చేస్తున్నాయని వారు విమర్శించారు. ప్రజలపై భారాలు మోపుతూ, పేదల సమస్యలను గాలికి వదిలేసి సంపన్నుల ఆస్తులు పెంచేందుకు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు.పేదలకు ఇళ్ల స్థలాలు, గృహాలు, ఉపాధి, విద్య, వైద్యం, రైతులకు గిట్టుబాటు ధర, కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత వంటి మౌలిక సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే సీపీఐ ఆధ్వర్యంలో మరింత ఉధృతమైన పోరాట కార్యక్రమాలు నిర్వహించడానికి వెనుకాడబోమని ప్రభుత్వాలను హెచ్చరించారు.తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరం విద్యార్థులు, యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కామ్రేడ్ ఎస్. విలాస్ అన్నారు. ఆ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు విద్యార్థులు, యువకులు, మహిళలు, కార్మికులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు సీపీఐని బలోపేతం చేసి ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు కామ్రేడ్ గాజంగుల రాజు, సీపీఐ జిల్లా సమితి సభ్యులు కామ్రేడ్ బత్తుల గంగారెడ్డి, సీపీఐ సీనియర్ నాయకులు కామ్రేడ్స్ బత్తుల రాజన్న, రామ్ రెడ్డి, సిసిలే దయానంద్, లక్ష్మి, యశోద, తుల్సి నర్సింగ్, చందా కిష్టయ్య, గంగారాం, గుండ్ల శ్రీను, ఖాళ్ళ నర్సింగ్, చంటి, మల్లేష్ తదితరులు, సీపీఐ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా
సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
డీజేలకు అనుమతి లేదు
ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం 
ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
టిబి పోషణ కిట్ల పంపిణీ
తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ