వికారాబాద్ జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ – మహిళలకు అవకాశం..!

వికారాబాద్ జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ – మహిళలకు అవకాశం..!

  • తాండూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో
  • 23 అంగన్వాడి టీచర్, 28 ఆయా పోస్టులు ఖాళీలు.
  • అక్టోబర్ 10 నుండి24 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ,
  • అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు: ధ్రువీకరణ పత్రాల సమర్పణకు గడువు.

తాండూరు (వికారాబాద్ జిల్లా) తాండూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయినట్లు తాండూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి ఏ సి డి పి ఓ శ్రీలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాండూరు ప్రాజెక్టు పరిధిలో 23 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 28 గిరిజన ప్రాంత అంగన్‌వాడీ ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 10.10.2026 నుండి దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 24.10.2026, సాయంత్రం 5.00 గంటల వరకు, ధ్రువీకరించిన జిరాక్స్ పత్రాల సమర్పణ: 26.10.2026 నుండి 01.11.2026 వరకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://wdcw.tg.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన అనంతరం సంబంధిత ప్రాజెక్టు కార్యాలయంలో అవసరమైన ధ్రువీకరించిన పత్రాలను సమర్పించాలని సూచించారు. అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, స్థానికత, రిజర్వేషన్లు, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు నని తెలియజేశారు.

Views: 54

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు
బిచ్కుంద,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్‌లో త్వరలో 10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ రాజర్షిషా
జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.