శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి 56వ శరన్నవరాత్రి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం
నాగర్ కర్నూల్, :నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి 56వ శరన్నవరాత్రి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ ను ఆహ్వానించారు. పట్టణ ఆర్య వైశ్య సంఘం, దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ను ఆర్య వైశ్య సంఘం, దేవాలయ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఉత్సవాలకు విచ్చేయాలని కోరారు. పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు బిల్లకంటి హరిబాబు, దేవాలయ కమిటీ అధ్యక్షుడు మిడిదొడ్డి అంజయ్య ఆధ్వర్యంలో ఈ ఆహ్వాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ, సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 56వ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


