CPS ఉద్యోగుల DA బకాయిలను ఒకేసారి చెల్లించాలి

CPS ఉద్యోగుల DA బకాయిలను ఒకేసారి చెల్లించాలి

వాయిదాల పద్ధతిని రద్దు చేయాలి — ప్రభుత్వానికి 

సంగారెడ్డి జిల్లా SGTU జిల్లా అధ్యక్షులు ఆకుల ప్రభాకర్ పటేల్  డిమాండ్ విజన్ ఆంధ్ర హత్నూర.ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎస్ జి టి యు అధ్యక్షులు ఆకుల ప్రభాకర్ పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని CPS ఉద్యోగులకు చెల్లించాల్సిన కరువు భత్యం (DA) బకాయిలను వాయిదాల పద్ధతిలో కాకుండా ఒకేసారి చెల్లించాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం (SGTU) సంగారెడ్డి జిల్లా శాఖ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఉద్యోగులకు ఇటీవల రెండు DA వాయిదాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం స్వాగతించదగిన పరిణామమే అయినప్పటికీ, వాటికి సంబంధించిన బకాయిలను దీర్ఘకాలిక వాయిదాల్లో చెల్లించాలనే నిర్ణయం CPS ఉద్యోగులకు పూర్తి స్థాయిలో ఆర్థిక ప్రయోజనం చేకూర్చదని SGTU అభిప్రాయపడింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, కుటుంబ నిర్వహణ ఖర్చులు, పిల్లల విద్య, వైద్య ఖర్చుల నేపథ్యంలో ఉద్యోగులకు రావాల్సిన DA బకాయిలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఉద్యోగుల శ్రమకు ప్రతిఫలంగా రావాల్సిన ఈ ఆర్థిక ప్రయోజనాలను దీర్ఘకాలం పాటు వాయిదాల్లో చెల్లించడం కంటే ఒకేసారి అందించడం ద్వారా వారికి తక్షణ ఆర్థిక ఉపశమనం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని CPS ఉద్యోగులకు సంబంధించిన DA బకాయిల్లో PRAN ఖాతాలకు జమ చేయాల్సిన మొత్తాన్ని నిబంధనల ప్రకారం జమ చేస్తూనే, మిగిలిన బకాయిలను నెలవారీ వాయిదాల్లో కాకుండా ఒకే విడతలో చెల్లించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని SGTU కోరుతోంది. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వారి హక్కు. వాయిదాల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితిని నివారించి, CPS ఉద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. కావున, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి CPS ఉద్యోగుల DA బకాయిలను ఒకేసారి చెల్లించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని SGTU సంగారెడ్డి జిల్లా శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. మా హక్కుమా బకాయిలు వాయిదాలు వద్దు ఒకేసారి చెల్లింపులు కావాలి!

Views: 18

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు
బిచ్కుంద,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్‌లో త్వరలో 10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ రాజర్షిషా
జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.