అప్రకటిత విద్యుత్ కోతలపై కర్షకుల కన్నెర్ర
- చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన...!!
- నార్సింగ్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా....!!!
- మెదక్- బోడమట్ పల్లి రహదారిపై ధర్నా,రాస్తారోకో..!!!?
పాపన్నపేట,: రైతాంగానికి అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ శుక్రవారం రోజు మెదక్ జిల్లా,పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగి సబ్ స్టేషన్ వద్ద రైతులు అధికారులపై కన్నెర్ర చేశారు.మెదక్- బోడమట్ పల్లి రహదారిపై బీజేపీ మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో రైతులు దాదా రెండు గంటల పాటు ధర్నా,రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు.రైతులకు కరెంటు సమయాను కూలంగా ఇవ్వలేకపోవడం మూలంగా చేతికొచ్చిన పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని, ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులకు 24గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు.విద్యుత్ ఏడిఈ వెంకటేశ్వర్లు,ఏఈ నర్సింలు వచ్చి రైతులకు సమాధానం చెప్పాలని ఎర్రటి ఎండలో రోడ్డుపై భీష్మించుకుని బైఠాయించారు.ఈ కార్యక్రమానికి జిల్లా బిజెపి అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్,మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా జనరల్ సెక్రెటరీ రంజిత్ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్స్ లక్ష్మణ్,భరత్ పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్,రాష్ట్ర బీసీకార్యవర్గ సభ్యుడు గడ్డం కాశీనాథ్,జిల్లా నాయకులు దిశా మెంబర్ ఏంఎల్ఎన్ రెడ్డి, జిల్లా నాయకులు బిక్షపతి,జిల్లా కిసాన్ మోర్చా జనరల్ సెక్రెటరీ శ్యామ్,ఆకుల ప్రభాకర్, చిన్నశంకరంపేట మండల అధ్యక్షుడు రాజు, హవేలీ ఘన్ పూర్ మండల అధ్యక్షుడు శ్రీను, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు సూరిబాబు,చంద్రన్న జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు బీకొండ రాములు,పాపన్నపేట మండల కన్వీనర్ నార్సింగ్ ఉప సర్పంచ్ శ్రీరామ్ నరేష్,ఆకుల సుధాకర్ పాపన్నపేట జనరల్ సెక్రెటరీ దుర్గాప్రసాద్, వెంకట్,బుల్లెట్ మండల కార్యవర్గ సభ్యులు సాయిబాబా,మల్లేశం, కొంపల్లి లక్ష్మణ్,గోపాల్ పాపన్నపేట మండలం కిసాన్ మోర్చా అధ్యక్షులు సిద్ధిరాములు,పాపన్నపేట పట్టణ అధ్యక్షులు సుంకరికిష్టయ్య,మండల నాయకులు బైండ్ల దుర్గయ్య,శంకర్ గౌడ్ కుమార్,చంద్రశేఖర్ యువమోర్చా నాయకులు రామ్ చందర్, తదితరులు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో దాదాపు 150 మంది రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఏడిఈ,ఏ ఈ లకు అందజేశారు.
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


