మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో నిందితునికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష వెయ్యి రూపాయల జరిమానా

మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో నిందితునికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష వెయ్యి రూపాయల జరిమానా

  • కట్టని యెడల అదనముగా మూడు నెలల జైలు శిక్ష
  •  నేరస్తునికి శిక్ష పడే విధంగా కృషిచేసిన పోలీస్ సిబ్బందిని అభినందించిన : పోలీస్ కమిషనర్

నిజామాబాద్ : మైనర్ మూడు సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ  నిజామాబాద్ స్టేషన్ జడ్జి జీవీఎన్ భరత లక్ష్మి  గురువారం తీర్పు చెప్పినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కిడ్నప్ చేసిన బాలికను దాచిపెట్టిన యువకుడికి ఎడేళ్ల జైలుశిక్ష కిడ్నప్ కు గురైన బాలికను దాచిపెట్టిన చెందిన సూర్యకాంత్  ఎడేళ్ల జైలుశిక్ష విదిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ ఏడు సంవత్సరాల కఠిన జైలుశిక్ష విదిస్తూ గురువారం తీర్పు చెప్పారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.మద్నూర్ మండలం సలాబాత్ పూర్ గ్రామానికి చెందిన గైక్వాడ్ బాలాజీ, సూర్యకాంత్ కూలీ పనిచేసుకుని బతికేవారు.కూలీ డబ్బులతో వచ్చే డబ్బులు బతకడానికి సరిపోతలేవని బావించిన బాలాజీ చిన్న పిల్లలు ఎవరినైనా అపంహరించి అమ్ముకుంటే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చనే దురాలోచనను తమ్ముడైన సూర్యకాంత్ కు తెలిపాడు. ఇద్దరు కలిసి నిజామాబాద్ నగరానికి వచ్చారు.గాంధారి మండలం ముదాలె నర్సాపూర్ గ్రామానికి చెందిన వీరం శిరీష తన ఇద్దరు కుమార్తేలతో, ఒక కుమారిడితో వృద్దురాలైన తన తల్లితో కలిసి వచ్చి నాగారం లో స్థిరపడి నగరంలోని  రహదారుల వెంట, దుకాణాలలో పైసలు అడుక్కుని బతుకు వెళ్ళదీసుకునేది.2025 వ సంవత్సరం ఏప్రిల్ 6 న రాత్రి సమయంలో నాగారం నుండి తన పిల్లలతో, తల్లితో కలిసి నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్ కు చేరుకుని గాంధీ విగ్రహం దగ్గర తన తల్లితో పాటు మూడేళ్ల కూతురు ఉంచి బిక్షం అడుక్కోవడానికి వెళ్ళింది. రాత్రంత తన..కుమారిడితో అక్కడక్కడ అడుక్కుని తిరిగి గాంధీ చౌక్ కు చేరుకుంది.అక్కడ నిద్రపోతున్న తన తల్లిని లేపి మూడేళ్ల కూతురు కనబడుటలేదని అడగడంతో నిద్ర వస్తే నిద్ర పోయిన ఇంతలో ఏమైందో ఏమో అని తెలపడంతో శిరీష నిజామాబాద్ ఒకటవ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె పిర్యాదు చెయడంతో ప్రాథమిక విచారణ నివేదిక తయారు చేసిన పోలీసులు సిసి టివి పుటేజీ ఇతర ఆధారాలు సేకరించి బాలికను కిడ్నప్ చేసింది గైక్వాడ్ సోదరులుగా గుర్తించారు. నేర విచారణలో భాగంగా పలు పోలీసు బృందాలు గాలించి గైక్వాడ్ సూర్యాకాంత్ ను అరెస్ట్ చేసి అతని నేర ఒప్పుకోలు పంచానామా నిర్వహించారు.బాలికను తాను కిడ్నప్ చేయలేదని తన అన్న బాలాజీ కిడ్నప్ చేసి సలాబాత్ పూర్ గ్రామానికి తీసుకువచ్చి తనకు అప్పగించాడని బాలికను అమ్ముదామని ప్రయత్నించేలోగ పోలీసులతో.. మీరు వచ్చి పట్టుకున్నారని తెలిపాడు.నేర విచారణ పూర్తి చేసిన పోలీసులు కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు.నేర న్యాయ విచారణ నిర్వహించిన జిల్లా సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ సాక్షుల వాంగ్మూలాల నమోదు చేసిన అనంతరం రెండవ ముద్దాయి అయిన గైక్వాడ్ సూర్యాకాంత్ పై కిడ్నప్ అయిన బాలికను దాచిపెట్టి ప్రధాన ముద్దాయి గైక్వాడ్ బాలాజీకి సహకరించినందుకు గాను ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష  విధించారు.  ఇట్టి కేసు లో నిందితునికి శిక్ష పడడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఇన్వెస్టిగేషన్ అధికారులు,  రఘుపతి ఎస్.హెచ్.ఓ టౌన్ -I ,మొగులయ్య  ఎస్.ఐ ,   బాల్ సింగ్ ఎస్ఐ ,  పబ్లిక్ ప్రాసిక్యూటర్  పి. రాజేశ్వర్ రెడ్డి , బ్రీఫింగ్ ఆఫీసర్  రఘుపతి సిఐపి ఎస్హెచ్ఓ టౌన్ 1 ,  టి. గోవింద్ ఎస్ఐపి  కోర్టులైజన్ ఆఫీసర్ , కోర్టు సీఎంఎస్ మరియు సిడిఓ లను  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐపీఎస్  ప్రశంసిస్తూ అభినందించడము జరిగింది.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు
బిచ్కుంద,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్‌లో త్వరలో 10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ రాజర్షిషా
జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.