చిలుకూరు సహకార సంఘం' బేష్ ' అమలు పని తీరును ఆదర్శంగా తీసుకోవాలి
చిలుకూరు( సూర్యాపేట ) : చిలుకూరు ప్రాథమిక సహకార సంఘం అమలు పనితీరును ఆదర్శంగా తీసుకోవాలని సిటీఐ అధికారి సంపత్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలోని సహకార సంఘాలలో పనిచేస్తున్న కార్య దర్శులకు, కంప్యూటర్ ఆపరేటర్లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా చిలుకూరు సహకార సంఘాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన సందర్శకులకు ముందుగా చిలుకూరు సహకార సంఘం సీఈవో లక్ష్మీనారాయణ సంఘం అమలు చేస్తున్న పనితీరు ను సంఘం నందు ఉన్నటువంటి సభ్యుల సంఖ్య, వివరాలు లోన్లు తీసుకున్న సభ్యుల సంఖ్య, ఫిక్స్డ్ డిపాజిట్లు సంఘం ఉపాధి లోన్స్, పొదుపు ఖాతా డిపాజిట్ల, ను సందర్శకులకు వివరించారు. చైర్మన్ అలస కాని జనార్ధన్ జనార్ధన్ సంఘం గురించి వివరిస్తూ చిలుకూరు గ్రామం రాజకీయంగా చాలాచైతన్యవంతమైనదని చెబుతూనే పెద్ద పెద్ద నాయకులు దొడ్డ నారాయణరావు లాంటి వాళ్లు ఈ సంఘానికి చైర్మన్గా పని చేసిన అనుభవం ఉన్నది. నేను చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు సంఘం 11 కోట్లతో ఉన్నది, ప్రస్తుతం ఉన్న పాలకవర్గం, సిబ్బంది సహకారంతో నాలుగు సంవత్సరాలలో 35 కోట్లతో వ్యాపారం చేస్తున్నామని వివరించడం జరిగింది. పాలకవర్గం డైరెక్టర్లంతా సహకరించడం వల్లనే మా సహకార సంఘ నూతన భవన నిర్మాణానికి నుండి 70 శాతం నిధులు 30% సంఘం సొంత నిధులతో మొత్తం 70 లక్షల రూపాయలతో నూతన భవనాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. చిలుకూరుప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భేష్.. సీ టీ ఐ అధికారి సంపత్ కుమార్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ కార్పోరేట్ బ్యాంకులకు ధీటుగా సహకార సంఘం భవనాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. చైర్మన్ గది, సీఈవో గది ఏ బ్యాంకులలో కూడా లేనటువంటి విదంగా గదులు విశాలంగా ఉన్నాయని కొనియాడారు. కౌంటర్ల నిర్వహణ విధానం చాలా బాగుందని ఆఫీసు నందు ఏసి ఏర్పాటు చేస్తే ఉద్యోగులు అలసిపోకుండా ఎక్కువ సమయం పని చేసే అవకాశం ఉన్నదని సూచించారు. అలాగే ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నటువంటి కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు ఈ సంఘంలో అమలు చేస్తున్న చర్యలు, నియమాలను పాటించాలని శిక్షకులకు సూచించారు. తీసి సివి మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ మా బ్యాంకు పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి ఫస్ట్ తారీకు వేతనాలు చెల్లిస్తున్నామని రైతుల నుండి రికవరి విషయంలో రైతులకు అవగాహన కల్పిస్తూ సులభంగా డబ్బులు రాబడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీ గౌసియా,ఖమ్మం డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కళ్యాణి, ఆర్.వేణు, డైరెక్టర్ కొండా సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


