ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి:  జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

నిర్మల్ : ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్య, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన సదుపాయాల కల్పన, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు అవసరమైన ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చినప్పుడే వారి సామర్థ్యాలు పెరుగుతాయని, అలాగే వారు మంచి వైద్యులుగా తీర్చిదిద్దబడతారని పేర్కొన్నారు.  విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వివరించారు.   వైద్య కళాశాలలోని విద్యార్థుల సంఖ్య, వారి విద్యా సంబంధిత విషయాలను అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు నిర్దేశిత పరీక్షలను నిర్వహిస్తూ, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.  ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆయా విభాగాల్లో అవసరమైన వైద్య సేవలను అందించేందుకు కావలసిన పరికరాలన్నీ ప్రాధాన్యత క్రమంలో సమకూర్చుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ రాజేందర్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ శారద, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, డిసిహెచ్ఓ కాశీనాథ్, ఇతర అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు
బిచ్కుంద,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్‌లో త్వరలో 10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ రాజర్షిషా
జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.