మున్నూరు కాపుల హక్కుల సాధనకై ఐక్య పోరాటం
తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య
సిద్ధిపేట, : మున్నూరు కాపుల హక్కుల సాధనకై ఐక్య పోరాటం చేయాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, జిల్లా అధ్యక్షుడు ఆకుల బాలయ్య పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రిజిస్ట్రేషన్ కు సంబంధించిన యాప్ ను సిద్దిపేట ప్రెస్క్లబ్లో సంఘం నాయకులు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.అధిక సంఖ్యలో జనాభా కలిగి ఉన్న మున్నూరు కాపులకు రాజ్యాధికారం రావడంలేదని..…అందరూ కలిసికట్టుగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. మున్నూరు కాపులందరినీ ఐక్యం చేసేందుకు గ్రామ గ్రామాన తిరిగి సంఘాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే సంఘ సభ్యుల రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక ఆప్ను రూపొందించామని తెలిపారు. ఈ యాప్ ను జిల్లాలోని మున్నూరు కాపు సంఘ సభ్యులు అందరూ తమ మొబైల్ ఫోన్లలో www.munnurukapusangam.org అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకొని తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మున్నూరు కాపుల సంఖ్య ఎంత ఉందనేది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది అన్నారు. అలాగే ఎన్నికల నిర్వహణకు కూడా రిజిస్ట్రేషన్ ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్క మున్నూరు కాపు సంఘం సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. అలాగే జిల్లా కమిటీలు, నియోజకవర్గం, మండలం, గ్రామాల వారిగా కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు నాయకం మల్లయ్య, వెంకటేశ్వర్లు, రమేష్, ప్రభాకర్, శ్రీనివాస్, భగవాన్, భూషణం, దేవరాజు, సుధాకర్, బాల్ రెడ్డి, లింగం, వెంకటేష్, తిరుపతి, నారాయణ, సత్యం, నర్సయ్య, పలువురు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


