ప్రముఖ సాహితీవేత్త ఆచార్య ముదిగొండ శివప్రసాద్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం 

ప్రముఖ సాహితీవేత్త ఆచార్య ముదిగొండ శివప్రసాద్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం 

తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటు: ముఖ్యమంత్రి 

హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారి మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్య రంగంలో విశేష సేవలందించిన ఆయన మరణం సాహితీ లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. నవలా రచయితగా, చరిత్ర పరిశోధకుడిగా, సాహిత్య విమర్శకుడిగా, వ్యాసకర్తగా ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు అందించిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి కొనియాడారు. తన రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడంతో పాటు పాఠకుల్లో చారిత్రక స్పృహను పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. తెలుగు పాఠకులకు మన దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఆయన చేసిన కృషి అభినందనీయమని సీఎం పేర్కొన్నారు. సాహిత్యం, చరిత్ర పరిశోధన రంగాల్లో ఆయన అందించిన సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించిన ముఖ్యమంత్రి, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సాహితీ సహచరులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు
బిచ్కుంద,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్‌లో త్వరలో 10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ రాజర్షిషా
జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.