నాగర్ కర్నూల్ డిపోలో 63.16 శాతం పోలింగ్

నాగర్ కర్నూల్ డిపోలో 63.16 శాతం పోలింగ్

పదేళ్ల తర్వాత ఓటేస్తున్న ఆర్టీసీ కార్మికులు

నాగర్ కర్నూల్  : తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో భాగంగా గురువారం నాగర్ కర్నూల్ డిపోలో పోలింగ్ ఉత్సాహంగా సాగింది. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నాగర్ కర్నూల్ డిపో పరిధిలో మొత్తం 285 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఉద్యోగికి రెండు ఓట్లు వేసే అవకాశం ఉంది. రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘం కోసం ఒక ఓటు, ఖమ్మం-నల్గొండ రీజియన్ స్థాయి గుర్తింపు కోసం మరో ఓటు వేస్తున్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ (అశ్వత్థామ రెడ్డి వర్గం), సీఐటీయూ అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, ఐఎన్‌టీయూసీ అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, బహుజన కార్మిక యూనియన్ కలిసి ఏర్పాటు చేసిన తెలంగాణ వర్కర్స్ యూనియన్ కూటమి బాణం గుర్తుకు మద్దతుగా కార్మికులు ఓటు వేస్తున్నారు. రీజియన్ స్థాయిలో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్‌కు కూటమి మద్దతు ప్రకటించింది. ఉదయం 10:30 గంటల వరకు నాగర్ కర్నూల్ డిపోలో 180 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం 63.16 శాతంగా నమోదైంది. రీజియన్ వ్యాప్తంగా ఇదే సమయానికి 1,350 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.

WhatsApp Image 2026-10-09 at 11.01.10 AM

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు
బిచ్కుంద,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్‌లో త్వరలో 10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ రాజర్షిషా
జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.