మాగనూరు మండల అధ్యక్షుడు జయానంద్ రెడ్డికి అశోక్ గౌడ్ సూటి ప్రశ్న!

మాగనూరు మండల అధ్యక్షుడు జయానంద్ రెడ్డికి అశోక్ గౌడ్ సూటి ప్రశ్న!

మాగనూరు మండలం : నేడు మాగనూరు మండల కేంద్రంలో భారతీజనతాపార్టీ మండల ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్ విలేకరులసమావేశం నిర్వహించి, తనను మండల ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు మండల అధ్యక్షుడు జయానంద్ రెడ్డి ప్రకటించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మండల ప్రధాన కార్యదర్శిని తొలగించే అధికారం మీకు ఎవరిచ్చారు? కనీసం షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ కోరే విధానం కూడా పాటించరా? పార్టీకి సంబంధించిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి నిర్దిష్టమైన విధానాలు ఉంటాయి. వాటిని పక్కనపెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని అశోక్ గౌడ్ ప్రశ్నించారు. ఒకవేళ నాపై ఏవైనా ఆరోపణలు ఉంటే ముందుగా షోకాజ్ నోటీసు ఇచ్చి, నా వివరణ కోరాలి. అనంతరం పార్టీ నిబంధనల ప్రకారం సంబంధిత నాయకత్వం నిర్ణయం తీసుకోవాలి. అంతేకానీ, పత్రికల ద్వారా నా బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడం ఏ విధమైన పార్టీ క్రమశిక్షణ అని ప్రశ్నించారు.

జయానంద్ రెడ్డి గారూ.. ఒక్క విషయం గుర్తుంచుకోండి!
నేను మీలాగా రాజకీయ స్వార్థాల కోసం పార్టీలు మారుతూ భారతీయ జనతా పార్టీలోకి రాలేదు. నిక్కచ్చిగా, నిజాయితీగా పార్టీ సిద్ధాంతాలను నమ్మి, ఒక సాధారణ కార్యకర్తగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను.
నాకు పదవులు ముఖ్యం కాదు.. పార్టీ సిద్ధాంతాలు ముఖ్యం!
నాకు హోదాలు ముఖ్యం కాదు.. కార్యకర్తల ఆత్మగౌరవం ముఖ్యం!
నాకు వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం కాదు.. పార్టీ గౌరవం ముఖ్యం!
పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ పార్టీ కోసం పనిచేసే నిజాయితీగల కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు.
నా ప్రశ్న ఒక్కటే..
షోకాజ్ నోటీసు ఇవ్వకుండా, వివరణ కోరకుండా, పార్టీ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోకుండా ఒక మండల ప్రధాన కార్యదర్శిని తొలగిస్తున్నట్లు ప్రకటించే అధికారం మీకు ఎవరిచ్చారు? అదేవిధంగా అశోక్ గౌడ్ మాగనూరు మండల ప్రధాన కార్యదర్శి కొనసాగుతాను వెల్లడించడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఈ ఆంజనేయులు గౌడ్ వార్డ్ మెంబర్లు భరత్ కుమార్ ఆనంద్ గౌడ్ మరియు బూత్ కమిటీ అధ్యక్షులు నాయకులు భీమ్రాజ్ సురేష్ పరశురాం నవీన్ సురేష్ తదితరులు పాల్గొనడం జరిగింది

Views: 79

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు
బిచ్కుంద,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్‌లో త్వరలో 10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ రాజర్షిషా
జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.