తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
టేక్మాల్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని టేక్మాల్ తెలంగాణ మోడల్ స్కూల్‌లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి పండుగ ఉత్సాహాన్ని చాటుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థినులు బతుకమ్మల చుట్టూ చేరి తెలంగాణ జానపద గీతాలు ఆలపిస్తూ, ఆటపాటలతో సందడి చేశారు. పూల పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబించేలా వేడుకలను ఉత్సాహంగా జరుపుకు న్నారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సుంకరి సాయిలు మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని తెలిపారు. విద్యార్థులు తమ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకొని భావితరాలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మురళీధర్, పార్థసారథి, రవికుమార్, భారతి, కిరణ్మయి, అపరంజిత, రమేష్, దుర్గేష్, సిద్దయ్య, అన్వేష్, శివ, షాకీర్, జలీల్, రమేష్, బసవ శేఖర్, శ్రీశైలం,లావణ్య, నవనీత, ప్రసన్న, చంద్రకళ, సంధ్య, జ్యోతి, కృష్ణవేణి, వ్యాయామ ఉపాధ్యాయుడు నర్సింలు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

