ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్

ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్

  • ప్రస్తుత కౌన్సిలర్, బిల్డర్ తోకల నరేష్ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
  • నకిలీ పత్రాలతో బ్యాంకు రుణం.. ఆదివాసీ బాధితుడికి అన్యాయం
  • ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి

ఆదిలాబాద్ పట్టణంలోని ఎల్‌బీఎస్ నగర్‌లో ప్లాట్ కొనుగోలు, ఇంటి నిర్మాణం పేరుతో ఆదివాసీ వ్యక్తిని మోసం చేసిన కేసులో మరో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రస్తుత కౌన్సిలర్, బిల్డర్ తోకల నరేష్‌ అప్పటినుండి పరారీలో ఉండగా  ఈరోజు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.

నిందితులు:

1. గటిక లక్ష్మణ్ స్వామి, s/o నర్సింలు, సంజయ్‌నగర్.(గతంలో అరెస్టు)
2. గటిక క్రాంతి కుమార్, s/o గటిక లక్ష్మణ్ స్వామి.(గతంలో అరెస్టు, రిమాండ్)
3. తోకల నరేష్, భాగ్యనగర్ కౌన్సిలర్. (శుక్రవారం అరెస్టు, రిమాండ్)

వివరాల్లోకి వెళితే.. ఎల్‌బీఎస్ నగర్‌లోని ప్లాట్ నంబర్ 37, సర్వే నంబర్ 45కు సంబంధించిన స్థలాన్ని కొనుగోలు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి బ్యాంకు రుణం ఇప్పిస్తామని నమ్మించి, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించి, బాధితుడు మడావి గోపాల్‌ను మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారంలో ఎస్‌బీఐ బ్యాంకు ద్వారా రూ.53.50 లక్షల రుణం పొందడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం అదనంగా రూ.13.70 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం రూ.67.20 లక్షల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు ప్లాట్‌కు సంబంధించి గతంలోనే మరొక వ్యక్తి కొనుగోలు చేసిన విషయాన్ని దాచిపెట్టి బాధితుడికి విక్రయించినట్లు, ఇంటి నిర్మాణం పూర్తయి గృహప్రవేశం చేసే సమయంలో అసలు యాజమాన్యానికి సంబంధించిన వివాదం వెలుగులోకి వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2026 ఆగస్టులో హైకోర్టు ఉత్తర్వుల మేరకు మున్సిపల్ అధికారులు ఇంటిని స్వాధీనం చేసుకోవడంతో తాను మోసపోయిన విషయం తెలిసిందని బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రశ్నించేందుకు వెళ్లిన బాధితుడి కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించి, చంపుతామని బెదిరించినట్లు కూడా ఫిర్యాదు అందింది. దీంతో ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఒక నిందితుడిని అరెస్టు చేయగా, అప్పటినుండి ఈ నిందితుడు పరారీలో ఉండగా తాజాగా ప్రస్తుత కౌన్సిలర్, బిల్డర్ తోకల నరేష్‌ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి రిజిస్ట్రేషన్ పత్రాలు, బ్యాంకు రుణం, ఇంటి నిర్మాణ అనుమతులు తదితర అంశాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు
బిచ్కుంద,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్‌లో త్వరలో 10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ రాజర్షిషా
జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.